జిల్లాలోని మార్కెట్ల వారీగా ఆదాయ వివరాలు
● 2025–26లో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు ● జిల్లాలోని ఆరు మార్కెట్లు సాధించింది రూ.17.67 కోట్లు
ఇల్లెందు: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్దేశిత ఆదాయ లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఇల్లెందు మార్కెట్ పురోగతిలో ఉన్నా అది కూడా లక్ష్యం సాధించలేదు. అధికారుల చిత్తశుద్ధి లోపించటం, మార్కెట్ కమిటీల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవటంతో మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోయింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు కాగా, రూ.17.67 కోట్లు మాత్రమే వసూలైంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కూడా ఈ దఫా లక్ష్యం సాధించలేక చతికిల పడింది. ఏడాది లక్ష్యం రూ. 5.16 కోట్లు కాగా, లక్ష్య సాధనకు మార్కెట్ అధికారులు కుస్తీ పట్టారు. వ్యాపారుల నుంచి ఫీజు రాబట్టే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్యం చేరుకోలేకపోయారు.
మార్కెట్ లక్ష్యం సాధించింది
(రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
బూర్గంపాడు 6.25 4.62
దమ్మపేట 3.67 2.88
ఇల్లెందు 5.16 4.03
భద్రాచలం 1.95 1.46
కొత్తగూడెం 3.47 2.30
చర్ల 2.12 2.11
మొత్తం 22.65 17.67


