పాల్వంచరూరల్: జెన్‌కో క్రీడాకారులు ప్రతిభ చూపి జాతీయస్ధాయిలో రాణించాలని కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్‌రావు అన్నారు. విద్యుత్ కళాభారతి మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇంటర్ ప్రాజెక్ట్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. భూపాలపల్లి జట్టు ప్రథమ, కేటీపీఎస్ 5,6 దశల జట్టు ద్వితీయ, కేటీపీఎస్ 7వ దశ జట్టు తృతీయ స్థానాల్లో నిలవగా, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ జెన్‌కో యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ సెక్రటరీ వీరస్వామి, కోశాధికారి రాజు, వెంకటేశ్వర్లు, జమీల్, అరుణ్, బాబీ, లింగమూర్తి పాల్గొన్నారు.


