2025–26లో రూ.2,297 కోట్లుగా నమోదు
వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2025–26)లో లెక్కకు మిక్కిలిగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 – 2025లో రూ.167.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025–26లో మాత్రం రూ.2,297 కోట్లుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 204 వైన్ షాపులు, 52 బార్లు, మూడు క్లబ్‌లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో వైన్స్ దక్కించుకున్న వారు భారీగా సరుకు కొనుగోలు చేశారు. అంతేకాక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయాన మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్టస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం సంవత్సరంలో 27,576 కేసుల మద్యం, 1,63,1729 కేసుల బీర్ల అమ్మకాలుసాగాయి.


