భద్రాచలం: గిరిజన, ఎస్‌హెచ్‌జీ గ్రూపుల మహిళలు నిర్వహించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని భద్రగిరి మార్టులో నిత్యావసర సరుకులను పరిశీలించేందుకు వచ్చిన సెర్ప్ సీనియర్ మేనేజర్ భవానీ శంకర్‌కు మార్ట్‌లోని ఆర్గానిక్ సరుకుల గురించి వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకున్న మహిళలు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతుండటంతో మార్ట్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, వేణు, హరికృష్ణ, సమ్మయ్య, ఆదినారాయణ, జయరాజ్, భార్గవి, నర్సయ్య, వెంకన్న పాల్గొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్


