వందేళ్ల స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఐ శత వసంతాల సాక్షిగా సమస్యలపై పోరాటం, పరిష్కారమే ధ్యేయంగా మరో వందేళ్లు కూడా ముందుకు సాగుదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు సీపీఐ రాజీలేని పోరాటం చేసిందని, ఈ క్రమంలో ఎందరో యువకిశోరాలు రక్త తర్పణం చేశారని తెలిపారు. తెలంగాణలో నిరంకుశ నిజాంను గద్దెదింపేందుకు జరిగిన మహత్తర సాయుధ పోరాటంలో 4,500మంది ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. తద్వారా వేలాది గ్రామాలు విముక్తి చెందగా, పదివేల ఎకరాల భూమిని పంఈనెల 18న ఖమ్మంలో నిర్వహించే శత వంసత ఉత్సవాల ముగింపు సభకు భారీగా ప్రజలను తరలించాలన్నారు. సమావేశంలో కంచర్ల జమలయ్య, నగేష్, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్లశ్రీనివాస్, బోయినవిజయ్‌కుమార్, సత్యనారాయణచారి, నర్సింహా, దుర్గ, సాయి కుమార్ పాల్గొన్నారు.
రంగవల్లులు.. ఆడ బిడ్డల కళారూపాలు
రంగులతో వేసిన ముగ్గులు ఆడపడుచుల కళారూపాలని కూనంనేని అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


