డైరెక్టర్ సాయిలుకు సన్మానం
ఇల్లెందురూరల్/టేకులపల్లి: మండలంలోని కొమరారం గ్రామానికి చెందిన చలన చిత్ర దర్శకుడు కాంపాటి సాయిలును బుధవారం పలువురు సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఉపసర్పంచ్ బుర్రి ప్రవీణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూసల నాగేశ్వరరావు, వాంకుడోత్‌కుమార్, తారాచంద్, మోతీలాల్, సంపత్, శంకర్ పాల్గొన్నారు. అలాగే, దర్శకుడు సాయిలును కొమరారంలో సంక్రాంతి పండుగ సందర్భంగా టేకులపల్లికి చెందిన యువకులు సన్మానించారు. పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్, మండల కార్యదర్శి తోటకూరి సతీష్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, అంతోటి రాకేష్, నదీమ్ ఉన్నారు.


