యాచకురాలు మృతి
జూలూరుపాడు: జూలూరుపాడులో ఓ యాచకురాలు(50) సోమవారం మృతి చెందింది. ఎస్‌ఐ బాదావత్ రవి కథనం ప్రకారం... యాచకురాలు జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాల్లో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. జూలూరుపాడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఓ టైర్ పంచర్ వర్క్ షాపు వద్ద ఆమె విగతజీవిగా పడి ఉండగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వివరాలు లభ్యం కాలేదు. మృతురాలు కనకంబరం రంగు చీర, లేత పచ్చరంగు స్వెట్టర్ ధరించి ఉంది. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిస్తే నంబర్‌లో 87126 82041 సంప్రదించాలని పోలీసులు కోరారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన నీరజ్‌కుమార్(20) ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన సోయం ప్రవీణ్, దుష్యంత్ ఈ నెల 19న రాత్రి సమయంలో కారులో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వస్తున్నారు. మండల పరిధిలోని గుర్వాయిగూడెం శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ముగ్గురూ గాయపడ్డారు. నీరజ్‌కుమార్‌ను విజయవాడ తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.


