రిజర్వ్ ఫారెస్టులో బోరు వేస్తున్న లారీ సీజ్
కారేపల్లి: కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధి చీమలపాడు రిజర్వు ఫారె స్టు ప్రాంతంలో బోర్ వేస్తున్నారనే సమాచారంతో అటవీఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. రాఘబోయినగూడెం నార్త్ బీట్‌లో ఆదివారం తెల్లవారుజామున తనిఖీ చేస్తుండగా బోరువెల్ లారీని గుర్తించి సీజ్ చేసినట్లు ఎఫ్‌డీఓ మంజుల తెలిపా రు. ఈమేరకు లారీని కారేపల్లి కార్యాలయానికి తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేశామనివెల్లడించారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో అక్రమంగా తవ్వ కాలు చేపట్టినా, బోర్లు వేసినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం కారేపల్లిలో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. ఎఫ్‌ఎస్‌ఓ పి.కిషోర్‌కుమార్, ఎఫ్‌బీఓలు సైదా, ఉష తదితరులు పాల్గొన్నారు.


