వెండి ఆభరణాలు బహూకరణ
బూర్గంపాడు: ముక్కోటి సందర్భంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని రామాలయానికి అదే గ్రామానికి చెందిన అత్తిపట్ల పుల్లయ్య, విజయ దంపతులు, అత్తిపట్ల వెంకటేశ్వరరావు, అరుణ దంపతులు, అత్తిపట్ల శ్రీను, ప్రవీణ దంపతులు వెండి ఆభరణాలను సోమవారం బహుకరించారు. శ్రీసీతారామ చంద్రస్వామివారికి రూ.1.80లక్షల విలువైన వక్షస్థల పాదుకలు, కర్ణపత్రాలు వెండి ఆభరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మొండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, దౌపాటి కృష్ణమూర్తి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, మెట్టు నాగిరెడ్డి, బానోతు రామదాసు తదితరులు పాల్గొన్నారు.


