
సీజనల్ వ్యాధులను అరికట్టాలి
కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యా ధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్, సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రత్యేక అధి కారి డాక్టర్ జి.శ్రీధర్ సూచించారు. శుక్రవారం ఆయ న కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని, పాల్వంచలో ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు ఇంటింటి సర్వే, యాంటీ లార్వా ఆపరేషన్లను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి వైద్యసేవల వివరాలు తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ ఎస్. జయలక్ష్మి, వైద్యాధికారులు రాధామోహన్, రమేష్, స్పందన, పుల్లారెడ్డి పాల్గొన్నారు.