
●కూలీలతో భోజనం.. ఆపై వరి పొలం దమ్ము, నాట్లు
రైతులా గడిపిన ఇల్లెందు ఎమ్మెల్యే
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం టేకులపల్లి మండలంలో పర్యటించారు. అనంతరం బేతంపూడి గ్రామంలో సామాన్య రైతులా మారారు. అక్కడ వరి నాట్లు వేస్తున్న కూలీలతో కలిసి భోజనం చేసిన ఆయన ట్రాక్టర్ నడుపుతూ పొలంలో దమ్ము చేశారు. ఆ తర్వాత యూరియా చల్లడంతో పాటు వరి నారు తీస్తూ కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీడీఓ మల్లేశ్వరి, ఆత్మ చైర్మన్ మంగీలాల్ తదితరులు నాట్లు వేయడం విశేషం. – టేకులపల్లి