
జిల్లాకు సంపూర్ణత అభియాన్ అవార్డు
చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, మండలాలను ఆకాంక్షిత జిల్లా, బ్లాక్‌లుగా గుర్తించి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో జిల్లాలో విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలకు చెందిన ఆరు సూచికలను 100 శాతం సాధించాలనే లక్ష్యంతో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఆరు సూచికల్లో మూడింటిని విజయవంతంగా పూర్తిచేశారు. బ్లాక్ స్థాయిలో గుండాల మండలంలో ఐదు సూచికలను పూర్తి చేసి అగ్రభాగంలో నిలిచారు. దీంతో నీతి ఆయోగ్ అధికారులు సంపూర్ణత అభియాన్ అవార్డుకు రాష్ట్రస్థాయిలో భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు కూడా ఎంపికయ్యాయి. ఆకాంక్షిత బ్లాక్ విభాగంలో జిల్లాలోని గుండాలతోపాటు మరో తొమ్మిది బ్లాక్‌లను ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్ రాజభవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డు అందుకోనున్నారు.
నేడు గవర్నర్ నుంచి
అందుకోనున్న కలెక్టర్