
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరా ట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
54 మంది
బాలకార్మికులకు విముక్తి
కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ ముస్కాన్–11తో జిల్లావ్యాప్తంగా 54 మంది బాలలకు విముక్తి కలిగించినట్లు ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జూలై 1నుంచి 31వరకు ఐదు బృందాలతో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 44 మంది బాలురు, 10 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి 53 మంది పిల్లలను అప్పగించామని, ఒక్కరిని హోంకు తరలించామని వివరించారు. పిల్లలను పనుల్లో పెట్టుకున్న 39 మందిపై కేసులు నమోదు చేశామని, 13 మందికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి
● ఆర్టీఐకమిషనర్ అయోధ్యరెడ్డి
దమ్మపేట: తోటలను చూస్తే తనకు కూడా ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి కలుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఆయిల్‌పామ్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. అంతర పంటలు కోకో, జాజికాయ సాగు గురించి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలను తట్టుకుని నిలబడటమే కాక ధర దృష్ట్యా ఆయిల్‌పామ్ పంట రైతులకు లాభదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, రైతు సంఘం నాయకులు కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
సమస్య వస్తే షీ టీంను
సంప్రదించాలి
● ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంటౌన్: మహిళలు ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపుల వంటి సమస్యలపై నిర్భయంగా షీటీంను సంప్రదించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. శుక్రవారం చుంచుపల్లి ఏహెచ్‌టీయూ ఆఫీస్‌లోని షీటీం కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ షీ టీం సభ్యులు రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్‌లు, విద్యాసంస్థలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మఫ్టీలో సంచరిస్తూ, నేరస్తులు, ఆకతాయిల కదలికలను గుర్తించాలని ఆదేశించారు. మహిళల సమస్యల పరిష్కారం ఓసం అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. షీ టీం నంబర్‌కు 87126 82131 సమస్యలపై ఫిర్యాదు చేయాలని కోరారు. సీఐ రాము,ఎస్సై నాగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఈఓను నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు!
కొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి గురువారం ఉద్యోగ విరమణ పొందారు. నూతన జిల్లా విద్యాశాఖాధికారి నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ నిర్ణయం తర్వాత నూతన డీఈఓ ఎవరూ అనేది తెలియనుంది.

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం