
యూరియా కొరత లేదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళనకు గురి కావొద్దని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయ, సహకార, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పంటల సాగుకు అవసరమైన యూరి యాను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలి పారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయడంతో యూరియాకు డిమాండ్ పెరి గినట్లు కనిపిస్తుందని అన్నారు. యూరియాను పంటల సాగుకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తే కఠి న చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ నంబర్ ఆధారంగా సరఫరా వివరాలు నమో దు చేయాలని సూచించారు. యూరియాకు బదులు రైతులు నానోయూరియా ఉపయోగించే విధం గా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈసీజన్‌లో వెయ్యి ఎకరాల మునగసాగు లక్ష్యంగా పెట్టుకోవాలని, తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ఆదా యం సమకూరుతుందని వివరించారు. అజొల్లా పెంపకం, బయోచార్‌పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఏఓ బాబూరావు, డీఎస్‌ఓ అవధాని శ్రీనివాసరావు, డీపీడీ ఆత్మ సరిత, మార్క్‌ఫెడ్ డీఎం సునీత, సొసైటీ సీఈఓలు, వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏఓలు పాల్గొన్నారు.