
తల్లి పాలే శ్రేయస్కరం..
పాల్వంచరూరల్: తల్లిపాల ప్రాముఖ్యతను చాటుతూ ప్రతీ ఏడాది ఐసీడీఎస్‌శాఖ ఆధ్వర్యాన వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ నెల 1 నుంచి 7 తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీడీపీఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. ఇందులో భాగంగా తొలిరోజు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో అవగాహన ప్రదర్శనలు, బిడ్డ తినే పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, రెండు, మూడో రోజున గర్భిణులు, తల్లులు, మహిళలు, పెద్దలతో తల్లిపాలు అనుబంధ ఆహారం ప్రారంభంపై అవగాహన, తల్లిపాల ప్రాముఖ్యతపై పోస్టర్ల ఆవిష్కరణ, ఉద్యోగ స్థలాల్లో తల్లిపాల కోసం ప్రవసీ కార్నర్ ఏర్పాటు, ఒక గంటలో తల్లిపాల ప్రారంభం గురించి అవగాహన కల్పించనున్నారు. అలాగే 4న అన్నప్రాశనపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించడం, 5న ఇళ్ల సందర్శన తల్లులకు తల్లిపాలు, అనుబంధం, ఫీడింగ్ ఫ్రీక్వెన్సీ, పిల్లలకు జన్మనివ్వడంపై కౌన్సెలింగ్, చివరగా 7న స్వయం సహాయక సంఘాలతో సమావేశమై పిల్లల ఆరోగ్యం, తల్లిపాలు, మహిళల సేంక్షేమంపై అవగాహన కల్పించనున్నట్లు సీడీపీఓ పేర్కొన్నారు.
నేటి నుంచి వారం పాటు అవగాహన కార్యక్రమాలు
ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఇంటింటా ప్రచారం
ఇంటింటా అవగాహన..
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు నిర్వహించనున్నాం. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించి తల్లిపాల ఆవశ్యకతను వివరించనున్నాం. అంగన్‌వాడీ కేంద్రలకు వచ్చే బాలింతలు, గర్భిణులు, బాలికలు, పిల్లలు, స్థానిక ప్రజలకు వివరించి జాగృతం చేస్తాం.– లక్ష్మీప్రసన్న, సీడీపీఓ పాల్వంచ