స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

Jul 30 2025 8:37 AM | Updated on Jul 30 2025 8:37 AM

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

చుంచుపల్లి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సత్తా చాటి అత్యధిక స్థానాలు కై వసం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కొత్తగూడెం పర్యటనకు రాగా, బైపాస్‌ రోడ్డు వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. దేశాన్ని 55 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌.. కనీసం ఎస్టీ కమిషన్‌ కూడా వేయలేకపోయిందని, అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ వచ్చాక ప్రత్యేక ఎస్టీ కమిషన్‌తో పాటు మినిస్ట్రీని సైతం ఏర్పాటు చేశారని చెప్పారు. తొలిసారి ఓబీసీ కమిషన్‌ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకి దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, డబ్బు కోసం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12వేల చొప్పున, నిరుద్యోగులకు ప్రతినెలా జీవనోభృతి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ వాటిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. పేదలకు ఉచిత బియ్యం కేంద్రమే ఇస్తున్నందున రేషన్‌ కార్డులపై మోడీ ఫొటో పెట్టాలని డిమాండ్‌ చేశారు. 18 నెలలుగా రిటైర్డ్‌ ఉద్యోగులకు, దివ్యాంగులకు కనీస బెనిఫిట్లతో పాటు పింఛన్‌ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత 11 ఏళ్లుగా నిరాటంకంగా దేశం అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం రాకముందు దేశంలో 75 విమానాశయ్రాలు మాత్రమే ఉండేవని, గత 11 ఏళ్లలో ఆ సంఖ్య 150కి పెరిగిందని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదని, ఒక మంత్రి యూరియా విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకం ఆడుతోందని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పూర్తిగా వారికే చెందాలని, 10 శాతం ముస్లింలకు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, నాయకులు తాండ్ర వినోద్‌ రావు, కుంజా ధర్మ, రంగాకిరణ్‌, జీవీకే మనోహర్‌రావు, బాలరాజు, విమల్‌ కుమార్‌ జైన్‌, కొదమసింహం పాండురంగచార్యులు, సీతారామరాజు, జెల్లారపు శ్రీనివాసరావు, విద్యాసాగర్‌, గొడుగు శ్రీధర్‌, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ది నాటకమే

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement