
డెయిరీకి మహర్దశ
ఖమ్మం ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)కు మహర్దశ పట్టనుంది. డెయిరీని బలోపేతం చేసేలా సర్కారు అడుగులు వేస్తోంది. పాడి పరిశ్రమ స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది. అంతేగాక మరో చోట 15 ఎకరాల్లో ఇంకో పరిశ్రమను నెలకొల్పే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, ప్రస్తుత ప్లాంట్‌ను రూ.2.35 కోట్లతో అధునికీకరించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ నిర్ణయించింది. – ఖమ్మంవ్యవసాయం
●నూతన డెయిరీకి ప్రతిపాదన..
ప్రస్తుతం ఉన్న పాడి పరిశ్రమను కొనసాగిస్తూనే మరో చోట 15 ఎకరాలు పరిశ్రమకు కేటాయించి నూతన డెయిరీని నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ ఖమ్మం ఆర్డీఓతో చర్చించి, పరిశ్రమకు అనువైన స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు.
50 ఏళ్లుగా వెనుకబాటే..
పూర్వపు ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా కోదాడ, సూర్యాపేట వరకు గల పాల ఉత్పత్తిదా రు ల, వినియోగదారుల ప్రయోజనాల కోసం 1975 లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నగరంలోని రోటరీనగర్‌లో పదెకరాల స్థలంలో పాడి పరిశ్రమను నెలకొల్పారు. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డెయిరీ అభివృద్ధిలో వెనకబడి ఉండగా, బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశ్రమను సందర్శించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర పాడి పరిశ్రమ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, పరిశ్రమ జనరల్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్(సివిల్), ఖమ్మం ప్లాంట్ డిప్యూటీ డైరెక్టర్‌లు సమావేశమై అభివృద్ధిపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
స్థలాన్ని సద్వినియోగం చేసేలా..
ఖమ్మం రోటరీనగర్ ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో పదెకరాల స్థలంలో విజయ డెయిరీ నడుస్తోంది. ఇందులో ఐదెకరాల వరకు వ్యాపార సమూదాయాలు నిర్మిస్తే పరిశ్రమకు ఆర్థిక వనరులు సమకూరుతాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని బస్టాండ్‌కు అప్పగించే అంశం కూడా చర్చకు వచ్చింది. ఇటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఈ స్థలాన్ని పరిశ్రమ కు ప్రయోజనం కలిగేలా వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.
అభివృద్ధికి ప్రణాళికలు..
ప్రస్తుత పాడి పరిశ్రమ ఆధునికీకరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించగా.. ఈ పనులకు రూ. 2.35 కోట్లు అవసరమని రాష్ట్ర పాడి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కలెక్టర్‌కు నివేదించా రు. పరిశ్రమ నిర్వహణ, ప్రస్తుత ప్లాంటులో మార్పులు, పలు యంత్రాల ఏర్పాటుతో పాటు సివిల్ పను ల నిర్వహణకు నిధులు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. దీంతో పాల నాణ్యత పెరిగితే వినియోగదారుల నుంచి ఆదరణ కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇక డెయిరీలో ఆది నుంచీ తాగునీటి సమస్య ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సమ స్య పరిష్కారానికి ఖమ్మం కార్పొరేషన్ నుంచి తాగునీరు సరఫరా చేయాలని కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లు సరిగా లేక ము రుగునీరు పరిశ్రమ ఆవరణలోకి వస్తుండగా దీని నివారణకు కూడా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఖమ్మం పాడి పరిశ్రమ
అభివృద్ధికి ప్రణాళికలు
వాణిజ్య అవసరాలకు
ప్రస్తుత పరిశ్రమ స్థలం..
తద్వారా విజయ డెయిరీకి
ఆర్థిక పరిపుష్టి
కొత్తగా మరొక నిర్మాణానికి
ప్రతిపాదనలు
పాడి పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి
ఖమ్మం పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. కలెక్టర్, రాష్ట్ర పాడి పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్‌తో కూడిన అధికారుల బృందం పరిశ్రమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది ఖమ్మం డెయిరీకి శుభ పరిణామం. – కె.రవికుమార్,
పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ డీడీ

డెయిరీకి మహర్దశ

డెయిరీకి మహర్దశ

డెయిరీకి మహర్దశ