
సగానికి తగ్గిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి
ఇల్లెందు: రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. ప్లాంట్‌లో పనిచేసే మూడు విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులను తొలగించారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ అధ్వానంగా మారింది. ఇక్కడి సైట్ ఇంజనీర్ వెంకటేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది 8 నెలలు కావొస్తుండగా ఆయన స్థానంలో మరో సైట్ ఇంజనీర్‌ను భర్తీ చేయలేదు. నిర్వహణ బాధ్యతలు చూసే సూపర్‌వైజర్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈనెల మొదటి వారం నుంచి కార్మికులు పనుల్లోకి వెళ్లటం లేదు. తమకు న్యాయం చేయాలని సమ్మెబాట పట్టారు. దీంతో ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇల్లెందు – కారేపల్లిరోడ్‌లో కోటమైసమ్మ ఆలయం సమీపంలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేసి న విషయం విదితమే. ఈ ప్లాంట్ నిర్వహణ టెండర్‌ను ఓ సంస్థ దక్కించుకుంది. ప్లాంట్ రక్షణ కోసం 30 మంది వరకు గార్డులు పనిచేయాలి. కానీ, తొమ్మిది మంది గార్డులను కొనసాగిస్తామని చెప్పటంతో గార్డులు సమ్మె బాట పట్టారు. ఇక ఆరుగురు ఎలక్ట్రీషియన్లు, 10 మంది గ్రాస్ కట్టింగ్ కార్మి కులు పనిచేస్తున్నారు. నిర్వహణ భారంగా మారిందని కార్మికులను తొలగించారు. తొమ్మిదిమంది గార్డుల ను కొనసాగిస్తూ రాత్రుల్లో చోరీల అదుపుకోసం విధులకు హాజరు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇక్కడి సీసీ కెమెరాలు కూడా సక్రమంగా పనిచేయటంలేదు. దీంతో చోరీలు పెరిగిపోయా యి. కాగా, రాత్రి సమయాల్లో తాము ఎంతకాలం విధులు నిర్వర్తించాలని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జూలై మొదటి వారం నుంచి విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది. ప్రతీ రోజు 1.50 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగాల్సి ఉండగా సగం కూడా ఉత్పత్తి జరగడం లేదని అధికారులే చెబుతున్నారు. ఈ తరుణంలో రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నీటి మీద రాతలుగా మారింది. ఈ అంశంపై సింగరేణి సోలార్ ప్లాంట్ పర్యవేక్షక ఇంజనీర్ వీరూనాయక్‌ను వివరణ కోరగా సంస్థ నిర్వహణ లోపం వల్ల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని, ఇది సంస్థ లోపమే తప్ప సింగరేణి లోపం కాదని పేర్కొన్నారు. విద్యు త్ ఉత్పత్తి తగ్గిపోయిన విషయం వాస్తవమేనని, కొన్ని ప్లేట్లు పని చేయడం లేదని, చాలా సమస్యలు ఉన్నాయని, మరో సంస్థకు టెండర్ అప్పగించే ప్రయత్నంలో కొంత జాప్యం సాగుతోందని పేర్కొన్నారు.
అంతా అస్తవ్యస్తంగా మారిన
ఇల్లెందు ఏరియా సింగరేణి

సగానికి తగ్గిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి