
కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కుర్సం రాము (31) పురుగులమందు సేవించి బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు మందలించారన్న క్షణికావేశంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగులమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు రామును ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకోవడంతో మంగళవారం ఇంటికి తీసుకొచ్చా రు. బుధవారం పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొమరారం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు.
రిటైర్డ్ జవాన్ ఆత్మహత్య
పాల్వంచ: పురుగులమందు తాగి రిటైర్డ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన రిటైర్డ్ జవాన్ జరబన సుధాకర్ (55) మంగళవారం మధిరలో ఓ కార్యక్రమానికి సోదరులు జరబన సీతారాములు, నిమడనేని సతీశ్‌తో కలిసి కారులో వెళ్లాడు. సాయంత్రం పాల్వంచ చేరుకున్నాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. బుధవారం తెల్లవారుజామున గట్టాయిగూడెం సమీపంలోని విద్యుత్ ఎంప్లాయీస్ కాలనీ పక్కన గల ఖాళీ స్థలంలో కారు ఆపి పురుగులమందు మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అతని పక్కనే పురుగులమందు డబ్బా ఉండగా అది తాగి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. కూనవరం రోడ్డులోని ఆర్టీఏ కార్యాలయం ఎదు రుగా ఎస్‌ఐ శ్రీహరి వాహ న తనిఖీలు చేపట్టారు. ఒడిశాకు చెందిన కమల్ బిశ్వాస్ ద్విచక్రవాహనంపై 11.70 కేజీల ఎండు గంజాయిని హైదరాబాద్ తరలిస్తూ పట్టుబడ్డాడు. గంజాయి విలువ రూ.7లక్షలు ఉంటుందని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. తనిఖీల్లో సిబ్బంది సుధీర్, వెంకట్, హరీశ్, హనుమంతరావు, ఉపేందర్ పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య

కుటుంబ సభ్యులు మందలించారని ఆత్మహత్య