
బ్రిడ్జి పాఠశాలలతో సత్ఫలితాలు
● వలస ఆదివాసీ ఆవాసాల్లో ఏర్పాటు ● ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ
చండ్రుగొండ : జిల్లాలో ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న బ్రిడ్జి పాఠశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐడీఓ (ఇండిజినస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ పాఠశాలలు నడుపుతున్నారు. అటవీప్రాంతాల్లో నివాసముంటున్న వలస గొత్తికోయ ఆదివాసీల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో గొత్తి కోయల ఆదివాసీ ఆవాసం ఎర్రబోడు ఉంటుంది. కనకగిరి అటవీప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు చదువు నేర్పేవారు. నిర్వహణ కష్టతరం కావడంతో ఐసీడీఎస్ అధికారులు కేంద్రం ఎత్తేశారు. ఈ క్రమంలో ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జి పాఠశాల ఏర్పాటు చేశారు. 39 మంది చిన్నారులకు 1 నుంచి 3వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 13 పాఠశాలల్లో 351 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడి మూడో తరగతి పూర్తి చేసినవారిని గత మూడేళ్లల్లో బూర్గంపాడు, ఉల్వనూరు, బూర్గంపాడులో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో 500 పిల్లల్ని చేర్పించారు.
ఆకర్షించేలా విద్యాబోధన
గొత్తి కోయ ఆదివాసీ పిల్లలను ఆకర్షించేలా విద్యాబుద్ధులు నేర్పుతున్నాం. అక్షరాలను నేర్పడమే కాకుండా కవితలు, కథలు నేర్పిస్తున్నాం. ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం.
–పద్దం విజయకుమారి, వలంటీర్, బెండాలపాడు
ఆటపాటలతో నేర్పుతున్నారు..
బ్రిడ్జి పాఠశాలలో విద్యాబోధన బాగుంది. చిన్నపిల్ల లకు ఆటపాటలతో అక్షరాలు నేర్పుతున్నారు. మా ఆవాసంలో పిల్లలంతా క్రమంతప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారు. –రవ్వా రమేష్,
ఆదివాసీ పెద్ద, ఎర్రబోడు
జిల్లాలో బ్రిడ్జి పాఠశాలల వివరాలు
మండలం గ్రామం పిల్లల సంఖ్య
లక్ష్మీదేవిపల్లి క్రాంతినగర్ 31
పాల్వంచ సిర్‌తన్‌పాడు 23
పాల్వంచ కోయగట్టు 34
పాల్వంచ రాళ్లచిలుక 26
పాల్వంచ సీతారాంపురం 40
చుంచుపల్లి జగ్గారం 26
చంచుపల్లి పాలవాగు 18
పినపాక ఎర్రకుంట 32
పినపాక ఉమేష్‌చంద్రనగర్ 28
మణుగూరు బుడుగుల 24
ములకలపల్లి రాచన్నగూడెం 23
చండ్రుగొండ బెండాలపాడు 31
టేకులపల్లి ఒంటిగుడిసె 15

బ్రిడ్జి పాఠశాలలతో సత్ఫలితాలు

బ్రిడ్జి పాఠశాలలతో సత్ఫలితాలు