
ఎస్పీకి ఘన సన్మానం
కొత్తగూడెంటౌన్: అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ రోహిత్‌రాజును శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ సహకరించిందని, ఈ మేరకు కృతజ్ఞతనగా ఎస్పీని సత్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జే.బీ శౌరీ, మారపాక రమేష్, కూసపాటి శ్రీనివాస్, ఎర్రా కామేష్, సుబ్బారావు, నాగేందర్, చదలవాడ సూరి తదితరులు పాల్గొన్నారు.
డీసీహెచ్‌ఎస్ రవిబాబుకు..
పాల్వంచ: డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్స్‌లెన్సీ అవార్డు రావడంతో శనివారం పాల్వంచ సీహెచ్‌సీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.రాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆస్పత్రుల బలోపేతానికి రవిబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డాక్టర్ సోమరాజు దొర, వైద్యులు వెంకన్న, మోహన్‌వంశీ, ప్రసాద్, పూజిత తదితరులు పాల్గొన్నారు.