
ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలి
పినపాక: ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల పరిధిలోని ఈ బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందజస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ సక్రమంగా పాటించాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
తొలివిడత పాఠ్య పుస్తకాలు చేరాయి..
కొత్తగూడెంఅర్బన్: 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడతగా జిల్లాకు 39,150 పాఠ్య పుస్తకాలు వచ్చాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను ఆయన పరిశీలించారు. వచ్చ విద్యా సంవత్సరంలో 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, తొలి విడతగా 39,150 పుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలన్నీ వస్తాయని, ఆ వెంటనే మండలాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు.
అభ్యసన స్థాయిని గుర్తించాలి
కరకగూడెం: విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని భట్టుపల్లి, కరకగూడెం ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బోధనా తీరును మెరుగుపర్చుకోవాలని, నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. అనంతరం మండల వనరుల కేంద్రంలో జరుగుతున్న నవోదయ పాఠశాల తాత్కాలిక మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ గడ్డం మంజుల, భట్టుపల్లి పాఠశాల హెచ్‌ఎం మోహన్‌బాబు తదితరులు ఉన్నారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి