
25న జిల్లాలో గవర్నర్ పర్యటన
● 24న రాత్రి సారపాకలో బస చేయనున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ● మరుసటి రోజు రామయ్య దర్శనం, రెండు జిల్లాల్లో భేటీలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం/భద్రాచలం: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈనెల 25న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను రాజ్‌భవన్ వర్గాలు మంగళవారం విడుదల చేశాయి. సూర్యాపేట జిల్లా ఈనెల 24వ తేదీ సాయంత్రం సారపాకలోకి ఐటీసీ గెస్ట్‌హౌజ్‌కు ఆయన చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
25న గవర్నర్ షెడ్యూల్ ఇలా..
● ఉదయం 8.10 గంటలకు భధ్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని గవర్నర్ దర్శించుకుంటారు.
● ఉదయం 9 గంటలకు కొత్తగూడెంలోని కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు.
● అనంతరం 11 గంటల వరకు ఎంపిక చేసిన 25 మంది ప్రముఖ రచయి తలు, కళాకారులు, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలతో భేటీ అయి మాట్లాడారు.
● అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు ఖమ్మంలోని ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌కు గవర్నర్ చేరుకుంటారు.
● మధ్యాహ్నం 1.55 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకుని సాయంత్రం 3గంటల వరకు జిల్లా అధికారులతో మాట్లాడతారు.
● ఆతర్వాత గంట పాటు ఎంపిక చేసిన 25మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలతో భేటీ అయ్యాక హైదరాబాద్ బయలుదేరతారు.