హామీల అమలుపై..ఆత్మపరిశీలన చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 12:50 AM | Updated on Feb 26 2023 5:09 AM

చండ్రుగొండ: క్యాంప్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

చండ్రుగొండ: క్యాంప్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

●రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.. ●పోడు పట్టాల పంపిణీలో చిత్తశుద్ధి చూపండి ●మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
చండ్రుగొండ: ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం చండ్రుగొండలో ఆయన క్యాంప్‌ కార్యాలయాన్ని శనివారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. వందలమంది ఆత్మబలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని, రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను, సహకరించిన బీజేపీని కాదని టీఆర్‌ఎస్‌కు ప్రజలు రెండు పర్యాయాలు పట్టం కడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ప్రజల మాదిరిగానే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లను నమ్మానన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సక్రమంగా ఇస్తున్నారా? రైతులు పడుతున్న గోస కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టినవెన్ని, పేదలకు ఇచ్చింది ఎన్ని? లెక్కలు చూసుకోవాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నామమాత్రంగా పోడు పట్టాలు ఇచ్చే ఎన్నికల స్టంట్‌ వద్దని, సీఎం కేసీఆర్‌ హామీ మేరకు పోడుపట్టాలు చిత్తశుద్ధితో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, జారే ఆదినారాయణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బాణోత్‌ పార్వతి, భోజ్యానాయక్‌, నరకుళ్ల సత్యనారాయణ, చెవుల చందర్‌రావు, సారేపల్లి శేఖర్‌, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement