జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న డీఎంహెచ్‌ఓ | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2023 12:50 AM

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ శిరీష   - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శేతామహంతి రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌ఓలతో శనివారం జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్‌ఓ శిరీష పాల్గొని మాట్లాడారు. హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానాలు, సబ్‌ సెంటర్‌ బిల్డింగ్‌లు, చైల్డ్‌ హెల్త్‌.. తదితర అంశాలపై వివరాలను కమిషనర్‌కు తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ టీబీకి సంబంధించి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌సీ, ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌బీఎస్‌యూ డేటా, ఇమ్యూనైజేషన్‌కు సంబంధించి మీజిల్స్‌ కోసం ఇంటింటి సర్వే నిర్వహించి 6 నెలల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారికి ఎంఆర్‌, ఎంఆర్‌–2 ఇప్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో డాక్టర్‌ నందిత, సుధీర, రాజేశ్‌, ప్రోగ్రాం అధికారులు మణికంఠారెడ్డి, చైతన్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement