గంజాయ్‌కి యువత చిత్తు ! | - | Sakshi
Sakshi News home page

గంజాయ్‌కి యువత చిత్తు !

Apr 16 2026 10:06 AM | Updated on Apr 16 2026 10:06 AM

గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 గంజాయ్‌కి యువత చిత్తు ! ఆత్మస్తుతి.. పరనింద చీరాల అర్బన్‌: చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటు అయ్యాక గంజాయి వినియోగం పెరిగింది. ఏడాదిలో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు పదేపదే చెప్పారు. అయితే సాధారణ తనిఖీల్లోనే పెద్ద మొత్తంలో గంజాయి, చాక్లెట్లు పట్టుబడుతుంటే నియంత్రణ ఎక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా విజనరీ ముందు చూపనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎక్కడంటే అక్కడే... గతంలో గంజాయి వినియోగించే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. అది కూడా ఎంతో రహస్యంగా వినియోగించేవారు. రైలు మార్గం ఉన్న ప్రాంతాల్లో ఒకింత ఎక్కువగా వినియోగం ఉండేది. అయితే బాబు పాలనలో గంజాయి దొరకని ప్రాంతం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నిషేధిత గంజాయి సాగు చేసేది ఒకరు... రవాణా చేసేది మరొకరు. దాన్ని స్థానికంగా అందిపుచ్చుకునేది ఇంకొకరు. అక్కడి నుంచి నిర్ణీత ప్రదేశాలకు తరలించేది వేరొకరు. అంతిమంగా విక్రయించేది మరికొందరు. ఇది ఒక చైన్‌లా కొనసాగుతోంది. వైఎస్సార్‌ సీపీ హయాంలో కట్టడి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణకు అధికారులు దిగారు. స్థానికంగా గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయటంతోపాటు మూలాలలోకి వెళ్లి సాగును సమూలంగా నాశనం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు. ఆ క్రమంలో పోలీస్‌, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, ఎస్‌బీ, సెబ్‌ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా సరిహద్దుల వరకు గంజాయి సాగు ఎక్కడ ఉందో ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. గంజాయి లభ్యం కాకుండా ఉక్కుపాదం మోపారు. దాదాపు గంజాయి సాగు, రవాణా, విక్రయాలు తగ్గాయి. చీరాల పరిధిలో.. రైళ్లలో చీరాల ప్రాంతంలో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, పోలీస్‌, ఎస్‌బీ, ఈగల్‌ టీం తదితరుల బృందం చేపట్టిన తనిఖీల్లో గత ఏడాదిలో ఆరు పర్యాయాలు గంజాయి పట్టుబడింది. ఈ నెల మొదటి వారంలో వేటపాలెంలో గంజాయి పట్టుబడింది. వాటిలో ఒక పర్యాయం గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. 2025 ఆగస్టు 24వ తేదీన బిలాస్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 8.10 కేజీల గంజాయి పట్టుకున్నారు. సెప్టెంబరులో బొకారలో ఎక్స్‌ప్రెస్‌లో 4 కేజీలు, అదే నెల 27వ తేదీన పూరి ఎక్స్‌ప్రెస్‌లో 16 కేజీలు, నవంబరు 3వ తేదీ పూరి ఎక్స్‌ప్రెస్‌లో 1.93 కేజీలు, డిసెంబరు 12వ తేదీన పూరి ఎక్స్‌ప్రెస్‌లో 71 గంజాయి చాక్లెట్లు, అదే నెల 21వ తేదీన ఎర్నాళులం ఎక్స్‌ప్రెస్‌లో 10 కేజీల గంజాయి పట్టుబడింది. తాజాగా ఈ నెల మొదటి వారంలో వేటపాలెం పోలీసులు 3.50 కేజీల గంజాయిని పట్టుకున్నారు. చీరాల, బాపట్ల మధ్య గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. అందుకు సంబంధించి కేసు బాపట్లలో నమోదైంది. ఇక మార్టూరు మండలం బోల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో పలుమార్లు గంజాయి చిక్కడం గమనార్హం. విద్యార్థులే లక్ష్యంగా.. గంజాయి విక్రేతలు విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్థానంలో గంజాయిని వారికి అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక తీర ప్రాంతాలలో వారాంతపు రోజుల్లో గంజాయి విక్రయాలు జోరుగా ఉంటున్నాయనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. కట్టడి చేయటం సాధ్యం కాదా..? ‘పాలకులు, అధికారుల్లో చిత్తశుద్ధి ఉంటే కట్టడి చేయటం కష్టమేమీ కాదు. యాక్షన్‌ ప్లాన్‌ లీక్‌ కాకూడదు. రాజకీయ జోక్యం ఉండకూడదు. అందుకు ప్రజల సహకారం కూడా అవసరంమని’ ఓ అధికారి తెలిపారు. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ జోక్యం ఏదో ఒక స్థాయిలో ఉంది. దీంతో కట్టడి అనేది మాటలకే పరిమితం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల సమాచారం

చంద్రబాబు సర్కార్‌ వచ్చాక గంజాయికి సంబంధించిన అంశాల్లో పరనింద, ఆత్మస్తుతికి పెద్దపీట వేశారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితలు గత ప్రభుత్వంలో గంజాయి వినియోగం పెరిగిందని.. సంవత్సరంలోపు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రెండో ఏడాది కూడా పూర్తి కావస్తోంది. గంజాయి కట్టడి అటుంచి, వినియోగం పెరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా మొక్కుబడిగా చేపట్టే తనిఖీల్లోనే పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. అధికారుల కళ్లు కప్పి రవాణా, చెలామణి అయ్యే గంజాయి పెద్ద మొత్తంలో ఉంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే నేరాల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు వినిపిన్నాయి. చీరాల మండలం ఈపురుపాలెం, ఆదినారాయణపురం ప్రాంతాల్లో జరిగిన రెండు హత్యలు గంజాయి బ్యాచ్‌ పనేనని పోలీసుల విచారణలో తేలటం దీనికి నిదర్శనం.

బాపట్ల
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఆత్మస్తుతి.. పరనింద

7

గంజాయి అంగడి సరుకుగా మారింది. మత్తుతో యువత చిత్తవుతున్నారు. విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి గంజాయి దిగుమతి అవుతోంది. సంబంధిత శాఖల అధికారుల తనిఖీల్లో పట్టుబడేది గోరంతయితే.. వినియోగం కొండంతగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

అంగడి సరుకుగా మారిన గంజాయి

పట్టుబడేది గోరంత... వినియోగం కొండంత

మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత

గంజాయి ఆకుతోపాటు చాక్లెట్ల రూపంలో విచ్చలవిడిగా లభ్యం

వారాంతపు రోజుల్లో తీర ప్రాంతానికి దిగుమతి

గంజాయి రహిత రాష్ట్రం చేస్తామన్న బాబు హామీ సంగతేంటని ప్రజల మండిపాటు

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7000, గరిష్ట ధర రూ.9000, మోడల్‌ ధర రూ.11500 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 527.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 4,205 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement