మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు | - | Sakshi
Sakshi News home page

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు

Jan 14 2026 9:51 AM | Updated on Jan 14 2026 9:51 AM

మహిళా

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు

బాలిక ఆత్మహత్య

మేడికొండూరు: మేడికొండూరు మండలం కొరప్రాడు గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మహిళను అసభ్య పదజాలంతో దూషించిన కొరప్రాడు గ్రామానికి చెందిన మద్దూ రామకోటిపై సీఐ నాగూర్‌ మీరా సాహెబ్‌ మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ తెలిపిన వివరాలు.. రామకోటి నూతన పాస్‌ పుస్తకం కోసం వెళ్లి వీఆర్వోను కలువగా ఆమె మీ పొలం కోర్టు కేసులో ఉందని, అర్జీ పెట్టుకుంటే ఓకే చేస్తామని చెప్పింది. కోపోద్రికుడైన రామకోటి మహిళా వీఆర్వోను అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడాడు. రామకోటి ప్రవర్తనకు భయపడిన మహిళా వీఆర్వో మేడికొండూరు పోలీసులను ఆశ్రయించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళా వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారి విధులకు ఆటంకం కలిగించిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగూర్‌ మీరా సాహెబ్‌ హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశాం: మంత్రి నాదెండ్ల

తెనాలి అర్బన్‌: ధాన్యం కొనుగోలు వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41.27లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రకటించారు. రైతులందరూ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

యడ్లపాడు: నూలుమిల్లు క్వార్టర్స్‌లో మైనర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పురుషోత్తంపూర్‌ తాలూకా, బడబరగాం గ్రామానికి చెందిన సజని బిష్ణోయ్‌ కుటుంబం ఉపాధి నిమిత్తం ఐదు నెలల కిందట బోయపాలెం గ్రామానికి వలస వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ నూలుమిల్లు కార్మికులుగా చేరి కంపెనీ క్వార్టర్స్‌లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. సజని బిష్ణోయ్‌ కుమార్తె ప్రియాంక బిష్ణోయ్‌(16) రెండేళ్లుగా తమ స్వగ్రామానికి చెందిన బబ్లునాయక్‌ అనే యువకుడితో తరచు ఫోన్‌ ద్వారా మాట్లాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతుర్ని మందించి ఆ యువకుడితో మాట్లాడవద్దని హెచ్చరించింది. మనస్థాపం చెందిన ప్రియాంక ఈనెల 12వతేదీ మధ్యాహ్నం కంపెనీ క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై యడ్లపాడు పోలీస్‌ స్టేషన్‌న్‌లో కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు.

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు1
1/2

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు2
2/2

మహిళా వీఆర్వోను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement