నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చీరాలకు చెందిన భక్తులు మంగళవారం రూ.2 లక్షల విరాళం సమర్పించారు. చీరాల కొత్తపేటకు చెందిన ఎం.రామకౌశిక్, యశస్విని దంపతులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నాగేశ్వరరావు, ప్రజ్ఞరాజశ్రీ పేరిట ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈఓ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ అరుణ్‌బాబు
తెనాలిటౌన్: త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. రూరల్ మండలం బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం ఆయన అధికారులతో కలసి పర్యటించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సెంట్రల్ స్కీమ్ ద్వారా సొంత ఇంటి స్థలం కలిగిన 91 మంది పేదలకు త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. అనంతరం జగ్గడిగుంటపాలెం గ్రామంలోని జగనన్న కాలనీ లే అవుట్‌ను పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు పరిశీలించి కాంట్రాక్టర్‌లతో ముచ్చటించారు. నిర్మాణం ఏ దశలో ఉంది, లబ్ధిదారులకు మేలు కలిగేలా నిర్మాణాలు జరుగుతున్నది లేనిది వాకబు చేశారు. నాణ్యత ప్రమాణాలకు లోటు లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజినీర్ జయరామాచారి, ఎస్‌ఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ ప్రసాద్, తెనాలి హౌసింగ్ ఈఈ భాస్కర్, ఏఈ బాలాజీ, ఉన్నారు.
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం


