సత్తా చాటిన వేటపాలెం ఎడ్లు
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆద్యంతంగా ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం న్యూ కేటగిరీ ఎడ్ల బల ప్రదర్శనలో బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన గిత్తలు 4,800 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు ఆర్‌కే బుల్స్ అత్తోటి శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి రూ.లక్ష నగదు బహుమతి అందుకున్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి ఎడ్లు 466.2 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.80 వేలు దక్కించుకున్నాయి. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాల, ముప్పాళ్లకు చెందిన ఎడ్లు 4,500 అడుగుల లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని పుచ్చకాయల శివపార్వతి, కల్యాణ్ మెమోరియల్స్‌కు చెందిన శేషాద్రి చౌదరి రూ.60 వేలు అందుకున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం మునుగోడుకు చెందిన ఎడ్లు 4,500.6 అడుగులు లాగి చతుర్థ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని కోపూరి శ్రీనివాసరావు రూ.50 వేలు, నంద్యాల జిల్లా బిళ్వలాపురానికి చెందిన ఎడ్లు 4,028.6 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని రూ.40 వేలు, గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన ఎడ్లు 3,911.4 అడుగులు లాగి 6వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు గువిబండి మాధవరెడ్డి అండ్ సన్స్, శ్రీనివాసరెడ్డి రూ.30 వేలు, కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తూడిచర్ల గ్రామానికి చెందిన ఎడ్లు 3,475.4 అడుగులు లాగి 7వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు రూ 25 వేలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని కోట కందుకూరుకు చెందిన ఎడ్లు 3,455 అడుగులు లాగి 8వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమాని గోన నరసింహారెడ్డి రూ.20 వేలు, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన ఎడ్లు 3,388 అడుగులు లాగి 9వ స్థానంలో నిలిచాయి. ఆ ఎడ్ల యజమానులు పి.ఈశ్వర్ ప్రణయ్ యాదవ్, అశ్విక్ యాదవ్ రూ.18 వేలు ప్రకారం ఎమ్మెల్యే అందచేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు యేర్వ చలమారెడ్డి, చేదూరి విజయభాస్కర్, వాగ్యా నాయక్, గుమ్మా ఎల్లేష్ యాదవ్, ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, కె.ఓబులరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, షేక్.బుజ్జి, దొండేటి నాగేశ్వరరెడ్డి, ఆర్.అరుణాబాయి, ఎల్.రాములు, పి.రాములు నాయక్, పల్లె సరళ, గార్లపాటి శార, వాడాల పద్మ, మిడత నరసింహారావు, మందుల ఆదిశేషు, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్, గోళ్ల కృష్ణారావు, సూరె శ్రీనివాసులు, షేక్.కాశింపీరా, షేక్ మహమ్మద్ కాశిం, షేక్ షెక్షావలి, తోకల ఆవులయ్య, గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
నేడు సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు
ఎడ్ల బలప్రదర్శనలో భాగంగా బుధవారం సీనియర్ విభాగంలో ఎడ్ల పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు ప్రథమ బహుమతి రూ.1.50 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.లక్ష, తృతీయ బహుమతి రూ.80 వేలు, చతుర్ధ బహుమతి రూ.70 వేలు, 5వ బహుమతి రూ.60 వేలు, 6వ బహుమతి రూ.50 వేలు, 7వ బహుమతి రూ.40 వేలు, 8వ బహుమతి రూ.30 వేలు, 9వ బహుమతి రూ.20 వేలు అందజేస్తారు.


