కలెక్టరేట్‌లో సంక్రాంతి సంబరాలు
బాపట్ల: జిల్లా యంత్రాంగం అంత ఒక కుటుంబం లాంటిదని అందరం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలైన మహిళలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌తో కలసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లను మరవకుండా రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా అన్ని శాఖల మహిళ ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తామని, పోటీల్లో ప్రతి శాఖ నుంచి జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముగ్గుల పోటీలు శాఖల మధ్య నిర్వహించడం వలన ఆ శాఖల మధ్య సమన్వయం ఏర్పడుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట మాట్లాడుతూ పల్లె వాతావరణంతో ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్పోర్డ్స్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు వైభవంగా నిర్వహించామని తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రెవెన్యూ శాఖకు చెందిన జానకి, రెండవ బహుమతి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఎన్.కృష్ణదేవి, ఏ.ఇందిరా దేవి, మూడో బహుమతి జిల్లా పౌర సరఫరాల శాఖకు చెందిన నాగవల్లి.వి.లక్ష్మి, 4వ బహుమతి జిల్లా పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఎ.మంగాదేవి, ఎ.రేణుక, ఐదో బహుమతి జిల్లా ల్యాండ్ – సర్వే శాఖకు చెందిన కె. భరణి ప్రభ, ఆరో బహుమతి మెప్మా శ్రీ లక్ష్మిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ.డాక్టర్ విజయమ్మ, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, సివిల్ సప్లై డీఎం శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది వివిధ శాఖల మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో సంక్రాంతి సంబరాలు


