క్షయ బాధితుల వివరాలు యాప్‌లో పొందుపరచాలి
అడిషనల్ డీఎంహెచ్‌వో, డీఎల్‌ఏటీబీ డాక్టర్ సోమ్లా నాయక్
చీరాల రూరల్: క్షయ వ్యాధి బాధితులను సకాలంలో గుర్తించి వారికి అందిస్తున్న వైద్య సేవలను నిక్షయ యాప్‌లో పొందుపరచాలని జిల్లా అడిషనల్ మెడికల్ అండ్ హెల్త్, జిల్లా టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ అధికారి డాక్టర్ సోమ్లా నాయక్ వైద్య ఆరోగ్య, ఆశా కార్యకర్తలను సూచించారు. సోమవారం ఆయన చీరాలకు వచ్చిన సందర్భంగా స్థానిక పాపరాజుతోటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వైకుంఠపురంలోని పీహెచ్‌సీని సందర్శించారు. రోగులకు అక్కడ అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ల్యాబ్‌లు, ఫార్మసీ, టీబీ కార్డులు, టీబీ నోటిఫికేషన్, రికార్డులను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలలోని వైద్యులు డాక్టర్ జాకోబు, డాక్టర్ హేమ మాధురి నుంచి వివరాలు సేకరించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ వ్యాధిపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాధితులకు అందించే మందులు ఆరోగ్య జాగ్రత్తలను ఎప్పటికప్పుడు యాప్‌లలో నిక్షిప్తం చేయాలని సూచించారు. అలానే క్షయవ్యాధిపై నిరంతరం బాధితులకు అవగాహన కల్పించాలని చెప్పారు. క్షయవ్యాధి అవగాహన కార్యక్రమాలను నిక్షయ ఎన్‌రోల్‌మెంట్, స్పుటమ్ పరీక్షలు, రిఫరల్స్ వంటి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. టీబీ మందులు వాడేవారికి టోల్‌ఫ్రీ నంబర్ 18003136120 పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో టీబీ ఆరోగ్య కార్యకర్త కె. శ్రీలక్ష్మి, ఫార్మసి కేశవ, కళ్యాణి, రమేష్, ప్రసన్న, డీపీసీ సీహెచ్ ప్రపుల్ల, ఐసీటీసీ కోఆర్డినేటర్ బాషా పాల్గొన్నారు.


