బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్‌.కె.అలీ అజగర్‌ | - | Sakshi
Sakshi News home page

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్‌.కె.అలీ అజగర్‌

Jan 13 2026 6:00 AM | Updated on Jan 13 2026 6:00 AM

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్‌.కె.అలీ అజగర్‌

బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్‌.కె.అలీ అజగర్‌

బాపట్ల బాపట్ల జిల్లా టూరిజం అధికారిగా ఎస్‌.కె.అలీ అజగర్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను ఎస్‌.కె.అలీ అజగర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సూచించారు.

అధికారుల నిర్లక్ష్యంపై రైతు నిరసన

యడ్లపాడు: ప్రభుత్వ పథకాల అమలులో రెవెన్యూ అధికారుల ఉదాసీనతపై ఓ రైతు బహిరంగంగానే తన నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని తిమ్మాపురంలో జరిగిన బహిరంగ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలోనే అధికారుల తీరును ఎండగట్టారు. ఐదు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానంటూ గ్రామానికి చెందిన రైతు రాధాకృష్ణ వేదిక వద్దకు వచ్చి తన ఆవేదనను వెలిబుచ్చారు. ఐదు దశాబ్దాల క్రితం వారసత్వంగా వచ్చిన భూమికి పలు కారణాలు చూపి ఆన్‌లైన్‌ ఎక్కించడం లేదని వాపోయారు. అర్హత ఉన్నా రెండు విడతలుగా ’అన్నదాత సుఖీభవ’ పథకం వర్తించడం లేదని ఫిర్యా దు చేశారు. రైతు ఫిర్యాదుపై స్పందించిన ఎంపీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భూముల సర్వేలో ఇబ్బందు లు ఉన్నా, పాస్‌ పుస్తకాల్లో తప్పులు దొర్లినా ప్రత్యేక షెడ్యూల్‌ రూపొందించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీలో ఏర్పాటుచేసిన రక్షిత నీటి ప్లాంట్‌, పార్కులో వాలీబాల్‌ కోర్టు, జెడ్పీహైస్కూల్లో క్రీడామైదానం అభివృద్ధి పనుల్ని ప్రారంభించి, గ్రామస్తులు నాగండ్ల రాంబాబు తన సొంత నిధులతో నిర్మించనున్న హిందూ శ్మశాన వాటికకు భూమిపూజ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement