ఎక్సమస్ జాన్, అధ్యక్షుడు
పల్నాడు–ఏ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల కార్యవర్గం ఎన్నిక
పిడుగురాళ్ల: పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు ఏ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల నూతన కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. అధ్యక్షులుగా ఎ.ఇమ్మానియేలురాజు, గౌరవాధ్యక్షులుగా కె.డానియేల్, ప్రధాన కార్యదర్శిగా ఎం.మోహన్‌కుమారి, కోశాధికారిగా కె.జ్ఞానరత్నం, మహిళా కార్యదర్శిగా ఎన్‌ఎన్‌ఎస్‌ఎల్ కాత్స్యాయనిలను ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రకియను ఏపీపీఈటీ అండ్ ఎస్‌ఏపీఈ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు బీఐ స్వర్ణరాజు నిర్వహించారు. ఏ జోన్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు కమిటీని అభినందించారు.
వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం(బి జోన్) అధ్యక్షులుగా పి.ఎక్స్‌మస్ జాన్, కార్యదర్శిగా అనిల్‌కుమార్ ఎన్నికయ్యారు. మండలంలోని కంభంపాడు జెడ్పీ హైస్కూల్‌లో జిల్లా పీఈటీ అండ్ పీడీ అసోసియేషన్ అధ్యక్షులు బి సువర్ణరాజు నేతృత్వంలో కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఆర్థిక కార్యదర్శులుగా బత్తుల వేణు, గౌరవాధ్యక్షులు గొట్టిపాటి కర్తయ్య, మహిళా సెక్రటరీగా అంజమ్మ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద్, రత్తయ్య, శ్రీను, రవి, భూషణం పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉచిత మోటారు వాహనాలు
ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): జిల్లాలో దివ్యాంగులకు ఉచిత మోటారు వాహనాల(మూడు చక్రాలు) పంపిణీకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి.దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. 70 శాతం, అంతకంటే ఎక్కువ లోకో మోటార్ వికలాంగత కలిగి ఉండి.. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ నెల 25వ తేదీలోగా www. apdascac. ap. gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 20.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా దుగ్గిరాల మండలంలో 1.4 మి.మీ వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి..పెదనందిపాడు 6.8, కాకుమాను 6.6, కొల్లిపర మండలంలో 5.2 మి.మీ. చొప్పున వర్షం పడింది.
ఎక్సమస్ జాన్, అధ్యక్షుడు
ఎక్సమస్ జాన్, అధ్యక్షుడు


