సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకుపోవాలి
బాపట్ల: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చు కుని ముందుకుపోవాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే స్మార్ట్ మొబిలిటీ, వెహికల్ సేఫ్టీ–ఏఐ సిస్టమ్స్‌పై వర్క్‌షాపును మంగళవారం ప్రారంభించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ మొబిలిటి, వాహన భద్రత, కృత్రిమ మేధస్సు రంగాల్లో తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నైపుణ్యాలను వెలికితీసే వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ వర్క్‌షాపు ఉపయోగపడుతుందని ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి తమ విద్యాసంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సొసైటీ జాయింట్ సెక్రటరీ డి.వెంకయ్యచౌదరి, ట్రెజరర్ బ్రహ్మయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమాదేవి, కన్వీనర్ డాక్టరు ఎన్.కార్తీక్ పాల్గొన్నారు.


