వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంతో శ్రమ,ఖర్చు ఆదా
జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ
బాపట్ల: వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంతో రైతులకు శ్రమ తగ్గటంతోపాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ అన్నారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగంపై సోమవారం గ్రూప్ కన్వీనర్, కో కన్వీనర్లకు బ్యాంకు అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ డ్రోన్ యంత్ర పరికరాల ఖరీదు కూడా 80 శాతం సబ్సిడీతో రైతు గ్రూపులకు అందించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డ్రోన్ ఉపయోగించటం వలన ఖచ్చితత్వం ఆధారంగా మందుల వినియోగం కూడా 20 నుంచి 25 శాతం ఆదా అవుతుందని తెలిపారు. సమావేశంలో అధికారులు బి.ప్రకాశ్‌రావు, దిబోరా, వివిధ కంపెనీల అధికారులు పాల్గొన్నారు.


