మేషం...
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు పెరుగుతాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ప్రతి నిర్ణయంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విలువైన వస్తువులు చేజారే వీలుంది. నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. దూరప్రయాణాలు సంభవం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. మానసికంగా కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆర్థిక లాభాలు. అప్రయత్న కార్యసిద్ధి. ఎరుపు, గులాబీ రంగులు. సూర్యారాధన చేయండి.
వృషభం....
ముఖ్యమైన కొన్ని పనులు మరింత చురుగ్గా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత పెరిగి ఉత్సాహంతో సాగుతారు. ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విలాసజీవనం గడుపుతారు. గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. వైద్యులు, రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, గోధుమ రంగులు. విష్ణుధ్యానం చేయండి.
మిథునం....
మీ ఊహలు నిజం కాగల సమయం. ముఖ్య కార్యక్రమాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఇబ్బంది రాదు. ఆప్తుల నుంచి కీలక సందేశం అందుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులు లాభాలు ఎట్టకేలకు దక్కించుకుంటారు. ఉద్యోగులకు చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు మరింత కలసిరాగల సమయం. వారం మధ్యలో లేనిపోని ఖర్చులు అధికం. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి..
కర్కాటకం...
ఆదాయానికి మించి ఖర్చులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలలో సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో మరింత సానుకూలత ఉంటుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో ధననష్టం. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, ఎరుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సింహం....
సన్నిహితులు, స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చలు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. పరపతి మరింత పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తుల వ్యవహారాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారులు కొంతమేరకు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో లేనిపోని ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. నేరేడు, గులాబీ రంగులు. శివాష్టకం పఠించండి.
కన్య....
కొన్ని కార్యక్రమాలు కొంత శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారస్తులు అనుకున్న మేర లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆప్తుల నుండి ఒత్తిడులు. నీలం. ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల...
మీ ఇష్టానికి అనుగుణంగా కుటుంబసభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు..సమయానుసారం కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారస్తులు భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో అదనపు «ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం.. ...
చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంతమేరకు పరిష్కారం. మీ భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. సేవామార్గంలో పయనిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సోదరులతో అపార్ధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రాగలదు. కళాకారులు, పరిశోధకులు అన్నింటా విజయం సాధిస్తారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, గోధుమ రంగులు. చంద్ర గ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు....
కుటుంబంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనసౌఖ్యం. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు ఏకీభవిస్తారు. స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణాలపై దృష్టి పెడతారు. పలుకుబడి పెరిగి అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు సంతోషకర సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆకస్మిక విదేశీయానం. వారం చివరిలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. కనకదుర్గాదేవిని పూజించండి.
మకరం...
చేపట్టిన పనులలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అ«ధిగమిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఊహలు కొన్ని నిజమవుతాయి. అదనపు ఆదాయం సమకూరి లబ్ధి పొందుతారు. బంధువుల సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వేడుకల్లో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు ఆశించిన విధంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వారం చివరిలో స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు.నీలం, నలుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.
కుంభం...
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులతో మనస్పర్థలు తొలగుతాయి. అందరిలోనూ గౌరవమర్యాదలు పొంది విధేయులను పెంచుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న రాబడి దక్కినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారస్తులు మరిన్ని లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు సంతోషంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు.నలుపు, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
మీనం...
ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని నిదానంగా సాగుతాయి. ఆదాయంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులు, బంధువుల ఆదరణ చూరగొంటారు. చాకచక్యం, ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకుంటారు. విద్యావకాశాలు దక్కే ఛా¯Œ ్స. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారస్తుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగులు మంచి గుర్తింపు పొందుతారు. అలాగే, ప్రమోషన్లు కూడా దక్కవచ్చు. వైద్యులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. పసుపు, ఎరుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


