వారఫలాలు: 4 డిసెంబర్‌ నుంచి 10 డిసెంబర్‌ 2022 వరకు

Weekly Horoscope Telugu 04-12-2022 To 10-12-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. చీటికీమాటికీ వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. కోర్టు వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉన్నా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో వ్యయ ప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదం ఒకటి పరిష్కారమయ్యే సూచనలు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయతే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరో«ధాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాల అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్నదానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బంది ఎదురై రుణాల వేటలో పడతారు. స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనకు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వివాహాది వేడుకల నిర్వహణపై కుటుంబంలో చర్చిస్తారు. విద్యావకాశాలు  పెరిగి విద్యార్థులకు ఊరటకలుగుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. వారం చివరిలో ధనవ్యయం.  గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top