ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, శుభవార్త వింటారు.. | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త పరిచయాలు, శుభవార్త వింటారు..

Published Thu, Mar 7 2024 6:06 AM

Today Rasi Phalalu: March 07- 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.ద్వాదశి రా.10.23 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.49 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.38 నుండి 3.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.13 నుండి 11.01 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృత ఘడియలు: రా.10.43 నుండి 12.12 వరకుు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.19, సూర్యాస్తమయం: 6.03. 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. ధనలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కష్టించినా ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్యం. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. దూరపు బంధువుల కలయిక. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

సింహం: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూలాభాలు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల అన్వేషణ. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా ్రÔ¶ వణం. వాహనయోగం. చర్చలు సఫలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు  అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: సన్నిహితుల సాయం అందుకుంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement