Today Horoscope (Rasi Phalalu) 04-08-2022 In Telugu - Sakshi
Sakshi News home page

Today's Horoscope: కీలక నిర్ణయాలకు ఈ రాశివారికి ఇదే సరైన సమయం

Aug 4 2022 6:56 AM | Updated on Aug 4 2022 10:52 AM

Today Horoscope 04-08-2022 - Sakshi

కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.సప్తమి రా.12.49 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం చిత్త సా.4.02 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.9.28 నుండి 11.04 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుండి 10.47 వరకు తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు అమృతఘడియలు... ఉ.9.40 నుండి 10.54 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. కీలక నిర్ణయాలకు తగు సమయం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తులు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

కన్య: రుణాలు చేయాల్సి వస్తుంది. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల: శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ధనుస్సు: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు,  ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

మీనం: రుణదాతల ఒత్తిడులు. పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

Advertisement
 
Advertisement
Advertisement