ఈ రాశి వారు శుభవార్తలు వింటారు | Today Horoscope 02-05-2022 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

May 2 2022 6:17 AM | Updated on May 2 2022 6:18 AM

Today Horoscope 02-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.విదియ రా.3.28 వరకు, తదుపరి తదియ నక్షత్రం కృత్తిక రా.11.10 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం ఉ.10.11 నుండి 11.54 వరకు, దుర్ముహూర్తం ప.12.20 నుండి 1.11 వరకు తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు అమృతఘడియలు...రా.8.33 నుండి 10.16 వరకు. 

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

రాశి ఫలాలు..

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

వృషభం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ.

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన.

కన్య: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమా«ధిక్యం.

తుల: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మీనం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement