ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 17-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

May 17 2026 3:59 AM | Updated on May 17 2026 3:59 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.పాడ్యమి రా.11.36 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: కృత్తిక సా.4.07 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.37 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: ప.1.54 నుండి 3.22 వరకు.

సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం...  ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం...  శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం. ఉద్యోగయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

మిథునం.....  ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం....  పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

సింహం.....  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య.....  వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

తుల....  పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

వృశ్చికం......  కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

ధనుస్సు.....  శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం.....  శ్రమాధిక్యం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం....  ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. మానసిక అశాంతి. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

మీనం...  పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement