ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ | Rasi Phalalu: Daily Horoscope On 06-07-2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ

Jul 6 2025 12:54 AM | Updated on Jul 6 2025 8:32 AM

Rasi Phalalu: Daily Horoscope On 06-07-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; ఆషాఢ మాసం; తిథి: శు.ఏకాదశి రా.8.24 వరకు, తదుపరి ద్వాదశి; నక్షత్రం: విశాఖ రా.10.44 వరకు, తదుపరి అనూరాధ; వర్జ్యం: రా.3.09 నుండి 4.55 వరకు; దుర్ముహూర్తం: సా.4.46 నుండి 5.38 వరకు; అమృత ఘడియలు: ప.12.54 నుండి 2.41 వరకు.తొలి ఏకాదశి

సూర్యోదయం  :  5.34
సూర్యాస్తమయం :  6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.

వృషభం.... పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింతగా అనుకూలిస్తాయి.

మిథునం... పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాల కోసం యత్నాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్యభంగం. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

కర్కాటకం... వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

సింహం... పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల.... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం... కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు... శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం... పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement