
శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి శు.అష్టమి ఉ.7.04 వరకు, తదుపరి నవమి నక్షత్రం మఖ ఉ.11.12 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం రా.7.04 నుండి 8.41 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.37 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.45 వరకుఅమృతఘడియలు... ఉ.8.50 నుండి 10.24 వరకు.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
రాశి ఫలాలు:
మేషం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ.
మిథునం: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు.సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కర్కాటకం: ప్రయత్నాలు విఫలం. కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
సింహం: అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. మిత్రులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మిత్రులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
ధనుస్సు: కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్య,కుటుంబసమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మకరం: వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బందువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. కుంభం..ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు,ఉద్యోగాలలో పురోభివృద్ధి.