● ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే
కూటమి కుట్రపై ఉద్యోగుల మండిపాటు
● జేఎసీ ఏర్పాటు
● నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనలు
మదనపల్లె సిటీ: ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టడానికి సమాయత్తమయ్యారు. ఆర్టీసీ యూనియన్‌లు అన్ని ఏకమై మంగళవారం నుంచి పోరాటం చేయనున్నాయి. ఈ ఉద్యమాన్ని నడిపించేందుకు వివిధ యూనియన్ల నాయకులు జేఎసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వతేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో మదనపల్లె–1,2, పీలేరు, రామచోటి, పీలేరు, పుంగనూరు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో 2,155 మంది ఆర్టీసీ కార్మికులు పని చేస్తున్నారు.
ప్రైవేట్‌పరం చేసేలా...
రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభు త్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి అడుగులు వేస్తోంది. దీన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్‌బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని... ప్రైవేటు వారికి అప్పగించొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బస్సులను సాకుగా చూపుతూ చంద్రబాబు సర్కారు రాష్ట్రంలోని పలు డిపోలను ప్రైవేటుకు అప్పగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పీఆర్‌సీ కూడా అమలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా సీ్త్రశక్తి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న సాకులు చూపి ఆర్టీసీ కార్మికులకు పనిష్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఉద్యోగభద్రత లేకుండా పో తోందని వారు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు అనేక డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు.


