ఎల్‌నినోను అధిగమిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను అధిగమిద్దాం

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

పీలేరు రూరల్‌ : రైతుల ఎల్‌నినో పరిస్థితులను అధిగమించడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా సహజ వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్‌ మోహన్‌ అన్నారు. సోమవారం బోడుమల్లువారిపల్లె రైతు సేవా కేంద్రం పరిధిలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పప్పు ధాన్యాలు, కూరగాయలు పంటలు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో శివశంకర్‌, ఏవో రమాదేవి, సిబ్బంది శ్రీదేవి, సుబ్రమణ్యం, వెంకటరమణా నాయక్‌, రహంతుల్లా పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

వాల్మీకిపురం: పట్టణంలోని ఏపీ మైనార్టీ బాలికల గురుకుల జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న కెమిస్ట్రీ సబ్జెక్టును బోధించేందుకు అర్హులైన మహిళా గెస్ట్‌ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ ద్వితీయ శ్రేణిలో సాధించి ఉండాలని పేర్కొన్నారు. బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 25లోపు బయోడేటా, సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు.

పీడీలు జాబ్‌ చార్ట్‌ పాటించాలి

మదనపల్లె సిటీ: పీఈటీలు, పీడీలలు జాబ్‌ చార్ట్‌ను తప్పకకుండా పాటించాలని డీఈఓ డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం స్థాని క జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీ,పీడీలకు వ్యా యామ విద్యావిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో వ్యాయామ, ఆరోగ్య విద్య అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. రికార్డులు, స్కిల్‌ రిజిస్టర్‌, స్టార్‌ రిజిస్టర్‌, అచీవ్‌మెంట్‌ తనిఖీ చేసి ధ్రువీకరించారు. పాఠశాల వ్యాయామ విద్య తనిఖీ అధికారి మహబూబ్‌బాషా, పీడీల సంఘ అధ్యక్షులు రమేష్‌బాబు కార్యదర్శి భద్రయ్య, అన్సర్‌, శివకుమార్‌, బాలాజీ పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచాలి

– కళాశాల విద్య ఆర్‌జేడీ మధుసూదన్‌ శర్మ

కడప ఎడ్యుకేషన్‌: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెండంతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్‌జేడీ) డాక్టర్‌. మధుసూధన్‌ శర్మ సూచించారు. సోమవారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు గత సంవత్సరం కంటే మెరుగయ్యేటట్లు చూడాలని సూచించారు. ఈ సమావేశంలో కడప జిల్లా ఉమ్మడి నోడల్‌ రీసోర్సు సెంటర్‌ అధ్యక్షులు ఎం రవి కుమార్‌, సభ్యులు సలీంబాషా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement