ఉపాధి హామీ పనుల బిల్లులకు క్షేత్ర స్థాయి సిబ్బంది వారానికి రూ.300 నుంచి రూ.500 వరకు అడుగుతున్నారు. ఇవ్వకపోతే బిల్లులు పెట్టడం లేదు. కొత్త పనులు చూపడం లేదు. ఎందకు అని ప్రశ్నిస్తే కక్ష సాఽధింపుతో వ్యవహరిస్తున్నారు. పనులు చేయని వారికి కూడా బిల్లులు పెడుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది బరితెగించిపోయారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా. విచారణకు ఆదేశించారు. – మేకల యోగానంద, ఎగువతూగుపల్లి, గాలివీడు మండలం
సాంకేతిక కారణాల వల్ల నాకు రెండు ఆధార్ కార్డులు ఉన్నట్లుగా సిస్టమ్ చూపుతోంది. ఒకటి క్యాన్సిల్ చేసి మరో ఆధార్ నెంబరుతో రేషన్ కార్డుకు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఫింగర్ వేస్తే ఆధార్ నెంబరు చూపడం లేదు. భవిష్యత్తులో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా ప్రవేశాలు తదితర ప్రభుత్వ సంక్షేమపథకాలలో సమస్యలు తలెత్తుతాయని డబుల్ ఆధార్ కార్డుల సమస్య పరిష్కరించాలి. – రోహిత్, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, మిట్టా మాలపల్లి, పెద్దమండ్యం మండలం


