రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేయలేదు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేయలేదు

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

మదనపల్లె టౌన్‌ : రోడ్డు ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్‌పై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడిపై బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం, నక్కలదిన్నె తాండాకు చెందిన దంపతులు హేమంత్‌ కుమార్‌ నాయక్‌, శ్రావణ మే 23న బి.కొత్తకోట మండలం, చలిమామిడి గ్రామానికి బైక్‌పై వెళ్లారు. కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఏపీ 39యూపీ 8834 నంబర్‌ బొలెరో వాహనం బైక్‌ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్‌ కుమార్‌ నాయక్‌ కుడి చేయి విరిగింది. శ్రావణికి కుడి కాలు విరగడంతో పాటు అబార్షన్‌ జరిగింది కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. అదే రోజు ముదివేడు పోలీసు స్టేషనన్‌లో ఫిర్యాదు చేసినా ఎస్‌ఐ మధురామచంద్రుడు ఇప్పటి వరకు విచారణ చేయకుండా, ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మదనపల్లె లో జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్లక్ష్య వాహన దారులపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

ముదివేడు ఎస్‌ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement