రొంపిచెర్ల : సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని చిత్తూరు జిల్లా వ్యవసాయాధికారి మురళి అన్నారు. సోమవారం రొంపిచెర్ల మండలం చెంచెంరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ ఆర్.బేస్తపల్లెలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సోయాబిన్ పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇస్తుందన్నారు. దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వమే క్వింటా రూ.4500కు కొనుగోలు చేస్తుందన్నారు. యురియా ,డీఏపీ పంట నమోదు బట్టి ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఎం శివశంకర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్, ఏవో శ్రావణి, ఏఈవో ఖాదర్‌బాషా, రైతు సహయ కేంద్రాల ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.


