ప్రశ్నించిన విద్యార్థి నేతలపై కేసులు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించిన విద్యార్థి నేతలపై కేసులు

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

ప్రశ్నించిన విద్యార్థి నేతలపై కేసులు

పుంగనూరు : అధికార పార్టీకి చెందిన మంత్రికి సంబంధించిన నారాయణ పాఠశాల అక్రమాలను, యాజమాన్యం విద్యార్థులను దోపిడీ చేయడంపై.. ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, స్వామి భక్తి చాటుకున్న సంఘటన పుంగనూరులో జరిగింది. పట్టణంలోని సూర్యనగర్‌లో గల నారాయణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు, బ్యాగులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తూ తల్లిదండ్రుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేస్తోందని శనివారం ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి కార్యదర్శి మున్నా, ఓబీసీ సంఘాల ప్రతినిధులు సురేష్‌యాదవ్‌, విక్రమ్‌ యాదవ్‌, వెంకట్‌యాదవ్‌ శాంతియుతంగా నిరసన తెలిపి, ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థి నాయకుల ధర్నాను విరమింపజేశారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. దీనిపై ప్రిన్సిపాల్‌ పవన్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులపై ఎఫ్‌ఐఆర్‌ నంబరు: 151 /2026 కేసును సెక్షన్ల 329(4), 351(2), 126(2), 292రెడ్‌విత్‌(3)5 బీఎన్‌ఎస్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. అధికార పార్టీ వారు తమను ప్రశ్నించిన వారిపై.. పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేయించడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

నారాయణ పాఠశాల వద్ద ధర్నాతో

రంగంలోకి పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement