బాలిక వైద్యానికి ఎంపీ భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలిక వైద్యానికి ఎంపీ భరోసా

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

బాలిక వైద్యానికి ఎంపీ భరోసా

చికిత్సకు బెంగళూరు తరలింపు

పుంగనూరు: ఓ పేద బాలిక గుండె జబ్బుతో బాధపడుతుండటాన్ని చూసి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి చలించారు. తక్షణమే ఆదివారం బాలికను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని సూచించారు. పెద్దమండ్యం మండలం సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్‌ దంపతులకు ఆలియ(10) అనే కుమార్తె ఉంది. ఈ బాలిక గుండెజబ్బుతో బాధపడుతోంది. చికిత్సకు లక్షలాది రూపాయలు కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఈ విషయం వైఎస్సార్‌సీపీ జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు, పుంగనూరుకు చెందిన ఎస్‌టీఎఫ్‌ సిద్ధిక్‌కు తెలియడంతో.. ఆయన వెంటనే ఎంపీ మిథున్‌రెడ్డి వద్దకు బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను తీసుకెళ్లారు. ఎంపీ తక్షణమే బాలికకు అవసరమైన ఆపరేషన్లకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా కల్పించారు. బాలికను బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్దు, బాబుల్లి, షఫి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement